జై భారత్ వాయిస్ న్యూస్ వరంగల్
తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం, TGICET–2025 కౌన్సిలింగ్ ప్రక్రియ MBA, MCA కోర్సులలో ప్రవేశాల కోసం శుక్రవారం నాడు తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని హెల్ప్ లైన్ సెంటర్లలో ఒకేసారి ప్రారంభమైంది.
వరంగల్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల హెల్ప్ లైన్ సెంటర్‌లో కౌన్సిలింగ్ విజయవంతంగా మొదలైంది. విద్యార్థులు ఉదయం నుండే హాజరయ్యారు. సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రక్రియ అధికారుల పర్యవేక్షణలో క్రమబద్ధంగా జరుగుతోంది.
Phase – 1 షెడ్యూల్
1️⃣ ఆన్‌లైన్ ఫైలింగ్, ప్రాసెసింగ్ ఫీజు చెల్లింపు & స్లాట్ బుకింగ్ → 20-08-2025 నుండి 28-08-2025 వరకు
2️⃣ సర్టిఫికేట్ వెరిఫికేషన్ → 22-08-2025 నుండి 29-08-2025 వరకు (27-08-2025 మినహాయించి)
3️⃣ ఆప్షన్ ఎంట్రీ (Options Entry) → 25-08-2025 నుండి 30-08-2025 వరకు
4️⃣ ఆప్షన్ ఫ్రీజింగ్ → 30-08-2025
5️⃣ సీట్ల ప్రొవిజనల్ అలాట్‌మెంట్ → 02-09-2025లోపు
6️⃣ ట్యూషన్ ఫీజు చెల్లింపు & స్వీయ రిపోర్టింగ్ → 02-09-2025 నుండి 05-09-2025 వరకుఈ సందర్భంగా ప్రిన్సిపాల్ డాక్టర్. బైరిప్రభాకర్ మాట్లాడుతూ*TGICET–2025 కౌన్సిలింగ్ వరంగల్ ప్రభుత్వ పాలిటెక్నిక్ హెల్ప్ లైన్ సెంటర్‌లో విజయవంతంగా ప్రారంభమైనందుకు సంతోషంగా ఉంది. మొదటి రోజునే విద్యార్థుల మంచి స్పందన లభించింది. అన్ని సదుపాయాలు సమర్థవంతంగా అమలు చేయబడి, ప్రక్రియ ఎలాంటి అంతరాయం లేకుండా సజావుగా కొనసాగుతోంది.విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకుని, MBA మరియు MCA కోర్సుల ద్వారా తమ భవిష్యత్తును మెరుగుపరుచుకోవాలని కోరుకుంటున్నామని ఆయన తెలిపారు.
previous post

