అన్నదాతను లంచం కోసం వేధించిన విద్యుత్ శాఖ ఉద్యోగి ఒకరు రాత్రిపూట దొంగలాగా పరుగెత్తాడు.. పొలంలో పడుతూ లేస్తూ కాళ్లకు బుద్ధి చెప్పాడు. ముచ్చటపడి కొనుక్కున్న కారును పొలంలో వదిలేసి.. కొద్ది క్షణాల క్రితం తీసుకున్న లంచం సొమ్మును పారేసి పరారయ్యాడు. ఆంధ్రప్రదేశ్ లోని పార్వతీపురం మన్యం జిల్లా మక్కువలో ఆదివారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. ఏసీబీ అధికారుల వివరాల ప్రకారం.