స్పోర్ట్స్ పాఠశాల్లో ప్రవేశానికి క్రీడా పోటీలు
(జై భారత్ వాయిస్ న్యూస్ నర్సంపేట ) :
తెలంగాణలోని స్పోర్ట్స్ పాఠశాలలో ప్రవేశం కోసం అర్హులైన విద్యార్థులకు ఈ నెల 17 వ తేదీన మండల స్థాయి క్రీడా పోటీలు నిర్వహించనున్నట్టు వరంగల్ జిల్లా ఖానాపూర్ మండల విద్యాశాఖాధికారి చరణ్ సింగ్ తెలిపారు. స్పోర్ట్స్ పాఠశాలలో 4వ తరగతిలో ప్రవేశానికి గాను. ఈ నెల 17 ఉదయం 9–00 గంటల కు ఖానాపురం మండలం అశోకనగర్ లోని సైనిక్ పాఠశాల ఆవరణ లో క్రీడా పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.ఈ పోటీలకు 2017 సెప్టెంబర్ ఒకటవ తేదీ నుండి 31 ఆగస్ట్ 2018 మధ్య జన్మించిన బాలబాలికలు అర్హులని తెలిపారు. కావున అర్హులైన విద్యార్థులను ఒక గైడ్ టీచర్ సహకారంతో వేదిక వద్దకు పంపించాల్సిందిగా ప్రధానోపాధ్యాయులకు సూచించారు. ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను జిల్లా స్థాయిలో మార్చి 28 నుండి ఏప్రిల్ ఒకటవ తేదీ వరకు పోటీలు నిర్వహిస్తా రని అన్నారు. అలాగే ఏప్రిల్ 27 నుండి మే 1 వరకు రాష్ట్ర స్థాయిలో వివిధ క్రీడాంశాలలో పోటీలు నిర్వహిస్తారని తెలిపారు. అత్యధిక ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు హకీంపేట, ఆదిలాబాద్, కరీంనగర్ లోని పాఠశాలలో పాఠశాలకు 20 మంది బాలలు, 20 మంది బాలికల చొప్పున 4 వ తరగతిలో ప్రవేశం కల్పిస్తారు.ప్రధానోపాధ్యాయులు ప్రాథమిక పాఠశాల విద్యార్థులను మంగళవారం ఉదయం 9-00 గంటలకు సైనిక్ స్కూల్ కు పంపించాల్సిందిగా ఎంఈఓ చరణ్ సింగ్ కోరారు
previous post
next post

