(జై భారత్ వాయిస్ న్యూస్ నర్సంపేట):
వరంగల్ జిల్లా లోని ఖానాపురం మండలం మనుబోతుల గడ్డ ప్రాథమిక పాఠశాలలో స్వయం పరిపాలన దినోత్సవం ఘనంగా జరిగింది. విద్యార్థులే ఉపాధ్యాయులై వ్యవహరించారు. తరగతుల్లో స్వయంగా బోధించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న సర్పంచ్ ఆబోతు శ్రీలత మాట్లాడుతూ విద్యార్థులు మంచిగా చదివి ఉన్నత స్థాయికి ఎదిగి గ్రామానికి మంచి పేరు తేవాలని అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన వారే అన్ని రంగాలలో అభివృద్ధి చెందుతున్నారని తెలిపారు. రానున్న విద్యా సంవత్సరంలో గ్రామంలోని అందరూ విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలో చేరెందుకు గ్రామంలో ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు. విద్యార్థులు కష్టపడి చదివి తల్లిదండ్రులకు మంచి పేరు తేవాలని కోరారు. ఉపాధ్యాయులు బోధనలో అంకితమై బోధన చేయాలని చెప్పారు. గ్రామంలోని పాఠశాలలో ఉపాధ్యాయులు విద్యార్థులను ఉత్తమ పౌరులు గా తీర్చి దిద్దాలని పిలుపు నిచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు కాకాని అశోక్ , ఉపాధ్యాయులు వాంకుడొతు వాగ్య, భూక్యా వీరన్న, వోల్లాల అశోక్, బిల్ల వెంకటేశ్వర్లు, అంగన్వాడీ టీచర్ తేజా వత కవిత, ఆయా జ్యోతి విద్యార్థులు పాల్గొన్నారు


