April 10, 2026
Jaibharathvoice.com | Telugu News App In Telangana
క్రీడా వార్తలు

క్రీడా పోటీలలో క్రీడాకారులు రాణించాలి

క్రీడా పోటీలలో క్రీడాకారులు రాణించాలి
(జై భారత్ వాయిస్ న్యూస్ వరంగల్ )
క్రీడలలో క్రీడాకారులు రాణించాలని వరంగల్ జిల్లా ఖానాపూర్
ఎం ఈ ఓ చరణ్ సింగ్ అన్నారు. హనుమకొండ , హకీంపేట, కరీంనగర్, ఆదిలాబాద్ లలోని స్పోర్ట్స్ స్కూల్ లలో 4వ తరగతి ప్రవేశాల కోసం క్రీడాపోటీలను మంగళవారం ఎంఈఓ చరణ్ సింగ్ అశోక్ నగర్ లోని సైనిక్ స్కూల్ ప్రాంగణంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడా పాఠశాలల్లో చేరడానికి పేద విద్యార్థులకు ఇది అద్భుతమైన అవకాశమని విద్యార్థులలో క్రీడా ప్రతిభను వెలికితీసే విధంగా ఈ పాఠశాలల నిర్వహణ ఉంటుందని తెలిపారు. భవిష్యత్తులో దేశానికి ఉత్తమ క్రీడాకారులను అందించే దిశగా ఈ పాఠశాలలు నడుస్తాయని పేర్కొన్నారు. తల్లిదండ్రులు , ఉపాధ్యాయులు విద్యార్థులలో ఆసక్తి , ప్రతిభను గుర్తించి ప్రోత్సహించాలని సూచించారు. ఉత్తమ ప్రతిభ కనబరిచిన క్రీడాకారులకు , విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సైనిక్ స్కూల్ ప్రిన్సిపాల్ గట్ల సురేందర్ , పీడీ లు సుభద్ర ,శ్రీనివాస్ , దేవేందర్ గైడ్ ఉపాధ్యాయులు బాలోజీ, చంద్రమౌళి, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Related posts

జిల్లా స్థాయి  యోగాసన పోటీలు

17న అశోక్ నగర్ లో స్పోర్ట్స్ పాఠశాల్లో ప్రవేశానికి క్రీడా పోటీలు

భారత మహిళా క్రికెట్ జట్టు విజయానికిసిఎం రేవంత్ రెడ్డి అభినందనలు